దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(అత్తవారింటికి అమ్మాయిని పంపుతూ కన్నకడుపు పడే బాధ - చెప్పే బుద్ధుల బరువూ భావాలూ - వినాలి అంతే)

110. అప్పగింతలు

మాయమ్మ కామేశ్వరి
పోయిరావమ్మ
పోయీ మీ అత్తింట
బుద్ధీకలిగుండూ

గడపాపై కూర్చుండి
జడవిప్పాబోకూ
కూర్చునప్పుడే తల్లి
కురులూ దులపాబోకు

వెండీ మట్టెలా కాలు
ఎత్తీ నడువకూమా
నడచీనప్పుడే తల్లీ
చెయ్యూచకమ్మా

మగవార్ని చూచియో
మగువా నవబోకూ
తగవూలాడేటీ చోటా
తలఎత్తాకమ్మా

పతికంటే ముందూ లేచీ
పనులెల్ల దీర్చీ
పతిపాదముల సేవ
భక్తీతో సేయూమా
AndhraBharati AMdhra bhArati - appagiMtalu - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )