ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
ఆశ్వాసాంతము
ఉ. రాజకులాగ్రగణ్య! మృగరాజపరాక్రమ! రాజరాజ! వి
భ్రాజితశుభ్రకీర్తి పరిపాండుర సర్వదిగంతరాళ! ఘో
రాజి ముఖోపలబ్ధ విజయ ప్రమదాశ్రిత బాహుదండ! ని
స్తేజిత వైరివీర! కులదీప! మృడప్రియ! విష్ణువర్ధనా!
161
క. ఆదిక్షత్త్ర చరిత్ర! ధ | రాదేవాశీఃపరంపరావర్ధిత ని
త్యోదయ! సత్యోదిత! విమ | లాదిత్యతనూజ! విక్రమాదిత్యనిభా!
162
తోటకము. నిరవద్య! నరేశ్వర! నిత్యనిరం | తర ధర్మమతీ! గుణధామ! జగ
త్పరిపూరిత కీర్తి విభాసి! విభా | కరతేజ! నృపోత్తమ! కాంతినిధీ!
163
గద్య. ఇది సకల సుకవి జన వినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీ మహాభారతంబునం దాదిపర్వంబున ననుక్రమణికయును, బౌష్యోదంక మాహాత్మ్యంబును, భృగువంశకీర్తనంబు నన్నది ప్రథమాశ్వాసము. 164
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )