ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
అనూరుఁడు జనించి వినతకు శాప మిచ్చుట (సం. 1-14-14)
క. తన గర్భాండంబులరెం | టను బ్రియనందనులు వెలువడమి, నతిలజ్జా
వనత యయి వినత పుత్త్రా | ర్థిని యొకయండంబు విగతధృతి నవియించెన్‌.
5
క. దాన నపరార్ధకాయవి | హీనుఁడు, పూర్వార్ధతనుసహితుఁ డరుణుఁ డనం
గా నుదయించె సుతుండు, మ | హానీతియుతుండు తల్లి కప్రియ మెసఁగన్‌.
6
వ. ఇట్లు వికలాంగుం డై పుట్టిన యనూరుండు వినతకు నలిగి ‘నన్ను సంపూర్ణశరీరుం గానీక యండం బవియించిన యవినీతవు కావున నీవు నీసవతికి దాసివై యేనూఱేం డ్లుండు’ మని శాపం బిచ్చి, ‘యింక నీ రెండవయండంబు తనకుఁ దాన యవియునంతకు నుండని; మ్మిందుఁ బుట్టెడు పుత్త్రుండు మహాబలపరాక్రమసంపన్నుండు నీ దాసీత్వంబు వాపు’ నని సెప్పి సూర్యరథసూతుండయి యరిగె; వినతయు నయ్యండం బతిప్రయత్నంబున రక్షించుకొనియుండె; నంత. 7
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )