ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
ఆశ్వాసాంతము
క. రాజమహేంద్ర! కవీంద్రస | మాజ సురక్ష్మాజ! రాజమార్తాండ! ధరి
త్రీజననుతచారిత్ర! వి | రాజిత గుణరత్న! రాజరాజనరేంద్రా!
236
వసంతతిలకము. వీరావతార! సుకవిస్తుత! నిత్యధర్మ
ప్రారంభ! శిష్టపరిపాలనసక్త! రాజా!
నారాయణాఖ్య! కరుణారసపూర్ణ! వీర
శ్రీరమ్య! రాజకులశేఖర! విష్ణుమూర్తీ!
237
గద్య. ఇది సకల సుకవిజన వినుత నన్నయభట్టప్రణీతం బయిన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున నాగగరుడోత్పత్తియు, సముద్రమథనంబును, నమృతసంభవంబును, సౌపర్ణాఖ్యానంబును, జనమేజయ సర్పయాగంబును, నాస్తీక చరితంబును నన్నది ద్వితీయాశ్వాసము. 238
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )