ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
ఆశ్వాసాంతము
క. వీరశ్రీవనితాశ్రిత | భూరిస్థిర బాహుదండ! బుధనుత సుగుణా
ధార! కలియుగపవిత్ర! పు | రారాతి పదాబ్జపూజనాసక్తమతీ!
227
మత్తకోకిల. దండితాహితవీర! సూరినిధాన! దానవినోద! కో
దండపార్థ! పరాక్రమ ప్రియధామ! దిక్పరిపూరితా
ఖండ పాండు యశోనిధీ! పరగండభైరవ! వైరివే
దండ గండ విదారి ఘోరతరాసి భాసిభుజార్గళా!.
228
గద్య. ఇది సకల సుకవిజన వినుత నన్నయభట్టప్రణీతం బయిన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున శ్రీమహాభారత కథాప్రారంభంబును, వ్యాసుజన్మంబును, దేవ ధైత్య దానవ ముని యక్ష పక్షి గంధర్వాది నానా విధభూత సంభవంబును, దదంశావతారంబును, రాజవంశోత్పత్తియు, యయాతిచరితంబును నన్నది తృతీయాశ్వాసము. 229
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )