ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
దుష్యంతుఁడు శకుంతలను నిరాకరించుట (సం. 1-68-18)
వ. అనిన విని దుష్యంతుండు దానినంతయు నెఱింగియు నెఱుంగనివాఁడ పోలె ని ట్లనియె. 76
క. ఏ నెఱుఁగ నిన్ను; నెక్కడి | దానవు? మిన్నకయ యనుచితంబులు పలుకం
గా నేల? యరుగు మంబురు | హానన! యెందుండి వచ్చి తందులకు వడిన్‌.
77
వ. అనిన విని, వెల్లనై, వెచ్చనూర్చి, నిశ్చేష్టిత యై, కెందమ్మిరేకులవలనం దొరంగు జలకణంబులపోలెఁ గోపారుణిత నయనంబుల బాష్పకణంబులు దొరంగం దలవాంచి, యారాజుం గటాక్షించుచు, హృదయసంతాపంబు దనకుం దాన యుపశమించుకొని, పెద్దయుం బ్రొద్దు చింతించి శకుంతల యా రాజున కి ట్లనియె. 78
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )