ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
ఆశ్వాసాంతము
క. సత్యాశ్రయకులశేఖర! | నిత్యోదయ! రాజరాజనృప! సుకవిజన
స్తుత్య మహాగుణ! విమలా | దిత్యాగ్రతనూజ! విమలధీరమణీయా!
274
ద్రుతవిలంబితము. త్రిభువనాంకుశ దీప్తినిధీ! సమ | స్తభువనాశ్రయ ధర్మధురంధరా!
శుభయశః పరిశోభిత పూర్వది | క్ప్రభువిలాస! కృపారసబంధురా!
275
గద్య. ఇది సకల సుకవిజన వినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబునం గౌరవ వంశ కీర్తనంబును, గంగా శంతను సమాగమంబును, వసూత్పత్తియు స్వర్గగమనంబును, దదంశ సంఘాతంబున గాంగేయు జన్మంబును, దద్రాజ్య నివర్తనంబును, బ్రహ్మచర్యవ్రత ప్రతిజ్ఞాపరిపాలనంబును, సత్యవతీ వివాహంబును, జిత్రాంగద విచిత్రవీర్యుల జన్మంబును, జిత్రాంగద మరణానంతరంబున భీష్ముండు విచిత్రవీర్యు రాజ్యంబున నిలుపుటయు, విచిత్రవీర్యుని వివాహంబును, వాని పరోక్షంబునఁగృష్ణద్వైపాయనువలన ధృతరాష్ట్ర పాండురాజుల జన్మంబును, మాండవ్యుశాపంబున విదురు జన్మంబును నన్నది చతుర్థాశ్వాసము. 276
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )