ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
కుంతీదేవియందు ధర్మరాజుజననము (సం. 1-114-3)
ఉ. శాత్త్రవజైత్రతేజమున సర్వదిశల్‌ వెలుఁగంగ నైంద్ర న
క్షత్త్రయుతుండుగా శశి ప్రకాశజయోన్నత మైన యష్టమిన్‌
మిత్త్రముఖగ్రహప్రతతి మేలుగ నాభిజితోదయంబునం
బుత్త్రుఁడు ధర్మునంశమునఁ బుట్టె నతిస్థిరధర్మమూర్తి యై.
94
క. ధరణీసురు లాదిగ ను | ర్వరలోఁ గల సర్వభూత వర్గం బెల్లం
బరమోత్సవ మొందెను గుణ | శరణ్యుఁ డగు ధర్మజన్ము జన్మదినమునన్‌.
95
క. శతశృంగ నిలయు లగు సం | శ్రితవ్రతులు విప్రవరులు సేసిరి ధర్మ
స్థితి జాతకర్మ మత్యు | న్నతిఁ బాండుప్రథమపుత్త్రునకు హర్షముతోన్‌.
96
క. కురుకుల విభుఁ డగు ధర్మ | స్థిరమతి యగు నీతఁ డనుచు ధృతిఁ జేసి యుధి
ష్ఠిరుఁ డను నామముఁ దా ను | చ్చరించె నాకాశవాణి జనవినుతముగన్‌.
97
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )