ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
భీమునిశరీరదార్ఢ్యము (సం. 1-114-11)
క. వీరుఁడు పాండుమహీపతి | దారుణ బాణ త్రయమునఁ దద్వ్యాఘ్రంబున్‌
ధారుణిఁ ద్రెళ్ళఁగ నడుమన | భూరిభుజుం డేసి కాచెఁ బుత్త్రుం దేవిన్‌.
113
క. ఉరు శార్దూల భయంబునఁ | బరవశ యయి కుంతి యున్న బాలకుఁడు శిలో
త్కరముపయిఁ బడియెఁ దన ని | ష్ఠురతనుహతిఁ జేసి రాలు చూర్ణంబులుగన్‌.
114
వ. దానిం జూచి పాండురాజు సంభ్రమంబునఁ బఱతెంచి విస్మితుం డై కొడుకు నెత్తికొని కుంతీదేవిం దోడ్కొని వేల్పులకు మ్రొక్కించి మగుడి నిజాశ్రమంబునకు వచ్చి సుఖం బుండి, గాంధారీధృతరాష్ట్రులకుఁ బుత్త్రశతంబు పుట్టుట విని, ఋషులవలన దివ్యమంత్రోపదేశంబుఁ గొని. 115
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )