ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
వసంతవర్ణనము (సం. 1-116-1)
లయగ్రాహి. కమ్మని లతాంతములకు మ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము లెసఁగెం; జూ
తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచు ముద మ్మొనర వాచా
లమ్ము లగు కోకిల కులమ్ముల రవమ్ము మధుర మ్మగుచు విన్చె; ననిశమ్ము సుమనోభా
రమ్ముల నశోకనికరమ్ములును జంపకచయమ్ములును గింశుకవనమ్ములును నొప్పెన్‌.
138
లయగ్రాహి. చందన తమాలతరులందు నగరుద్రుమములందుఁ గదళీవనములందు లవలీ మా
కంద తరుషండములయందు ననిమీలదరవిందసరసీవనములందు వనరాజీ
కందళిత పుష్పమకరందరసముం దగులుచుం దనుపు సౌరభము నొంది జనచిత్తా
నందముగఁ బ్రోషితులడెందము లలందురఁగ మందమలయానిల మమందగతి వీచెన్‌.
139
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )