ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
మాద్రి సహగమనము సేయుట (సం. 1-116-25)
తరువోజ. కురువంశ నిస్తారకుల ధర్మయుక్తిఁ గొడుకులఁ బడసి యి క్కురుకుంజరునకుఁ
గరము మనఃప్రీతి గావించి పుణ్యగతికిఁ గారణమవై కమలాక్షి! నీవు
దిరముగా నిష్టంబు దీర్చి; తే నిందు ధృతిఁ బతియిష్టంబు దీర్పన; కాన
యరిగెదఁ బతితోడ నన్యలోకంబునం దైనఁ బ్రీతిసేయఁగఁ గాంతు ననియు.
145
వ. ‘మఱియు మృగశాపభయం బెఱింగియు ని ట్లేమఱిన యతిప్రమత్తురాల; నే నిందుండి పుత్త్రుల రక్షింప నేర; నన్ను వారింప వలవదు; కొడుకుల నేమఱక రక్షించునది’ యని చెప్పి కుంతీదేవి వీడ్కొని మునిసహస్రంబునకు మ్రొక్కి మద్రరాజపుత్త్రి పతితోడన చితారూఢ యై యగ్నిశిఖల నపగత ప్రాణ యయ్యె; నంత నయ్యిరువుర యంగంబులు సంగ్రహించుకొని మహామునులు కుంతీదేవిం గొడుకుల నూరార్చి. 146
క. ధరణీరాజ్యవిభూతియు | పరిజనులను బాంధవులను బ్రజ విడిచి తప
శ్చరణతపస్వుల తనకున్‌ | శరణం బని నమ్మి పాండుజనపతి నెమ్మిన్‌.
147
క. కొడుకుల నిందఱ కిల్లడ | యిడి పరలోకమున కరిగె; నెడసేయక యి
ప్పుడ వీరలఁ గురువృద్ధుల | కడకుం గొని పోవ వలయు గజపురమునకున్‌.
148
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )