ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
ఆశ్వాసాంతము
క. వ్యసనవివర్జిత! మాన | వ్యసగోత్రపవిత్ర! విష్ణువర్ధననృప! స
ప్తసముద్రముద్రితాఖిల | వసుధాజనగీతకీర్తి! వాసవమూర్తీ!.
260
వనమయూరము. రాజకులశేఖర! పరంతప! వివేక | భ్రాజిత! జగద్వలయభాసురసముద్య
త్తేజ! నిరవద్య! యువతీమదన! వీరో | గ్రాజివిజయా! త్రిభువనాంకుశ! నరేంద్రా.
261
గద్య. ఇది సకలసుకవిజనవినుతనన్నయభట్టప్రణీతం బైన శ్రీ మహాభారతంబునం దాదిపర్వంబున ధృతరాష్ట్ర పాండురాజుల వివాహంబును, బాండురాజదిగ్విజయంబును, బాండవధార్తరాష్ట్రసంభవంబును, బాండురాజు నిర్యాణంబును, గృపద్రోణజన్మకథనంబును, గుమారాస్త్రవిద్యాగ్రహణంబును నన్నది పంచమాశ్వాసము. 262
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )