ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
ఆశ్వాసాంతము
క. మలహారినాథ! విలస | చ్చళుక్యకులతిలక! రాజసర్వజ్ఞ! రిపు
ప్రలయప్రతాప! పరనృప | లలనాననకమలహరిణలాంఛనమూర్తీ!
311
మాలిని. ప్రణమదఖిలధాత్రీపాలకాలోలచూడా
మణిగణకిరణశ్రీమండితాంఘ్రీ! నరేంద్రా
గ్రణి! నిఖిలమహీరక్షామణీ! రాజనారా
యణ! విమలమతీ! శీతాంశువంశప్రకాశీ!
312
గద్య. ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబునం గుమారాస్త్రవిద్యా సందర్శనంబును, ద్రుపదగ్రహణమోక్షణంబును, దుర్యోధనుదుర్మంత్రంబును, వారణావతయాత్రయు, జతుగృహ దాహంబును, విదురోపదిష్టద్వారంబునం బాండవాపక్రమణంబును, హిడింబు వధయును, హిడింబా వివాహంబును, వ్యాససందర్శనంబును, ఘటోత్కచసంభవంబును, విప్రగృహంబున నజ్ఞాతచర్యయును, బకాసురవధయును నన్నది షష్ఠాశ్వాసము. 313
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )