ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
పాండవులు పాంచాలపురంబునకు బయలుదేరుట (సం. 1-156-2)
క. కడుఁబెద్దకాల ముండితి | మొడఁబడి; యిం దెంతకాల మున్నను మన క
య్యెడు లాభ మేమి? మఱి యె | ప్పుడు నుచితమె యొరుల యిండ్ల పొత్తున నుండన్‌.
29
వ. దక్షిణపాంచాలంబు గరంబు రమ్యం బనియును, బాంచాలపతి పరమధార్మికుం డనియును వింటిమి; మఱి యట్లుం గాక. 30
క. అడుగకయు విప్రవరులకు | నడరఁగ నద్దేశమున గృహస్థులు భక్తిం
గుడువఁగఁ బెట్టుదు రెప్పుడుఁ | గడు హృద్యము లయిన మోదకంబులతోడన్‌.
31
వ. ‘అందులకుం బోవుద’ మనినం గొడుకులెల్ల వల్లె యని ‘మీ పంచిన విధంబ చేయం గలవార’ మని యొడంబడి తమయున్న యింటిబ్రాహ్మణునకుం జెప్పి వీడ్కొని. 32
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )