ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
శ్రీకృష్ణ బలరాములు ధర్మరాజాదులఁజూడవచ్చుట (సం. 1-183-2)
శా. రాజత్కీర్తులు వచ్చి కాంచి రనఘుల్‌ రాముండు గృష్ణుండు న
య్యాజామీఢు నజాతశత్రు నృపలోకారాధ్యు నుద్యద్గుణ
భ్రాజిష్ణుం దమ మేనయత్త కొడుకున్‌ బాలార్కతుల్యోజ్జ్వల
త్తేజున్‌ భ్రాతృచతుష్కమధ్యగతుఁ గౌంతేయాగ్రజున్‌ ధర్మజున్‌.
217
వ. కని త మ్మెఱింగించి యతిస్నేహంబున నయ్యుధిష్ఠిరునకుం గుంతీదేవికి మ్రొక్కి భీమార్జుననకుల సహదేవులం గౌఁగిలించుకొని, పరమసమ్మదరసపూరితహృదయు లై యున్న, వారల కుశలం బడిగి ధర్మరా జి ట్లనియె. 218
క. ఒవ్వమిఁ గౌరవులకుఁ గడు | దవ్వయి మఱి విప్రవేషధారుల మయి మ
మ్మెవ్వరు నెఱుంగకుండఁగ | నివ్విధమున నున్న నెట్టు లెఱిఁగితి రీరల్‌.
219
వ. అనిన నగుచు వాసుదేవుం డి ట్లనియె. 220
ఉ. అంబుజమిత్రుఁ డంబుదచయాంతరితుం డగుడుం దదీయ తే
జంబు జగజ్జనంబులకు శక్యమె కప్పఁగ; మీరు గూఢభా
వంబున నున్న మీదగు నవారితతేజము భూజనప్రసి
ద్ధం బగుఁ గాక; దానిఁ బిహితంబుగ నెవ్వరుఁ జేయనేర్తురే.
221
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )