ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
ఆశ్వాసాంతము
క. విద్యావిలాస! పార్థివ | విద్యాధర! నిఖిలరాజవిద్యానిధి! శీ
తద్యుతి విశదయశః ప్రస | రద్యోతిత సర్వలోక! రాజమహేంద్రా!
289
స్వాగతము. రాజరాజ! గుణరాజిత! రాజ | త్తేజ! రాజకులదీప! విశిష్టాం
భోజమిత్ర! నృపపూజిత పాదాం | భోజ! భూవినుత! పుణ్యవరేణ్యా!
290
గద్య. ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున ధృష్టద్యుమ్న ద్రౌపదీసంభవకథనంబును, గృష్ణద్వైపాయనసందర్శనంబును, గంగాతీరంబున నంగారపర్ణు నర్జునుండు జయించుటయుఁ, దాపత్యవసిష్ఠౌర్వోపాఖ్యానంబును, ద్రౌపదీస్వయంవరంబును, బంచేంద్రోపాఖ్యానంబును, ద్రౌపదీవివాహంబును నన్నది సప్తమాశ్వాసము. 291
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )