ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
సుందోపసుందు లొండొరులతోఁ బోరి చచ్చుట
క. అనవుడు నిద్దఱుఁ దమలోఁ | బొనుపడ కొండొరులతోడ భుజబలు లలుకన్‌
ఘనవజ్రతనులు దాఁకిరి | తనరఁగ నటఁ గొండ గొండఁ దాఁకినభంగిన్‌.
111
క. విపరీతమతిని సుందుఁడు | నుపసుందుఁడుఁ దాఁకి పొడిచి రొండొరుతోడం
గుపితాత్ము లయి తిలోత్తమ | నెపమున దృఢముష్టిఘాతనిర్ఘాతములన్‌.
112
క. అన్యోన్యప్రియభాషణు | లన్యోన్యహితైషు లసుర లన్యులపోలెన్‌
మన్యుపరిప్రేరితు లై | యన్యోన్యాభిహతిఁ జనిరి యమపురమునకున్‌.
113
క. ఇంతుల నిమిత్తమున ధృతి | మంతులుఁ బొందుదురు భేదమతి గావున మీ
రింతయు నెఱింగి యొండులు | చింతింపక సమయ మిందు సేయుఁడు బుద్ధిన్‌.
114
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )