ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
సమయభంగకారణమున నర్జునుండు తీర్థయాత్రకుం జనుట (సం. 1-206-12)
వ. కావున వ్రతదానంబు నా కనుగ్రహింప వలయు’ నని మ్రొక్కి యర్జునుం డగ్రజు వీడ్కొని గురుజనానుమతుం డై యఖిలవేదవేదాంగపారగు లైన బ్రాహ్మణులు ననేకశాస్త్రవిదు లయి వివిధకథాకథనదక్షు లయిన పౌరాణికులును దనకు సహాయులుగా నరిగి సకలతీర్థసేవచేయుచు నయ్యైతీర్థంబులందు. 124
ఆ. ధరణిసురుల గురులఁ బరమయోగుల మహా | భాగు లయిన యట్టి భాగవతుల
రాజవంశవరుఁడు పూజించుచును వారి | వలనఁ బుణ్యకథలు వెలయ వినుచు.
125
క. గంగాధర పింగజటా | సంగమ మంగళ విశాల చటుల తరంగన్‌
గంగానది సేవించెను | గంగాద్వారమున విగతకల్మషుఁ డగుచున్‌.
126
వ. అందు నిత్యంబును గంగాస్నానంబు సేసి తత్తీరంబున హోమంబు సేయుచు వాసవసుతుండు మహీసురవర సహితుం డయి కొన్ని దివసంబులు వసియించి, యొక్కనాఁడు ప్రభాతంబ విధిపూర్వకంబునం గృతాభిషేకుం డయి దేవర్షి పితృతర్పణంబులు సేసి. 127
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )