ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
ఇంద్రుం డర్జునునకు నాగ్నేయ వారుణ వాయవ్యాది దివ్యబాణంబు లిచ్చుట (సం. 1-225-7)
వ. అతిమానుష మత్యద్భుత | మతిదుష్కర మయిన కేశవార్జునకృతి గో
పతి చూచి మెచ్చి సురపరి | వృతుఁ డయి చనుదెంచెఁ గృష్ణవిజయులకడకున్‌.
319
క. అనఘులు నరనారాయణు | లన నాదియుగంబునన్‌ సురాసురనుతు ల
య్యును నపుడు మనుజు లగుటను | వినయంబున మ్రొక్కి రమరవిభునకు నంతన్‌.
320
వ. ఇంద్రుండు నుపేంద్రార్జునుల నతిస్నేహంబునఁ గౌఁగిలించుకొని యర్జునునకు నాగ్నేయవారుణ వాయవ్యాది దివ్యబాణంబు లిచ్చి, ‘వీని కెప్పుడు నిష్టసఖుండ వయి యుండు’ మని కృష్ణుం బ్రార్థించి, దివ్యవిమానారూఢుం డయి దివిజాప్సరోగణసేవితుం డయి దివంబున కరిగె; నిట వాసుదేవార్జునులు మయుం దోడ్కొని మగిడి యింద్రప్రస్థపురంబునకు వచ్చి, ధర్మరాజునకు మ్రొక్కి ఖాండవదహనప్రకారంబు సెప్పి మయుం జూపి సుఖం బుండి రని. 321
క. జనమేజయజనపాలున | కనఘచరిత్రునకుఁ బ్రీతుఁ డయి వైశంపా
యనుఁ డాదిపర్వకథ యె | ల్లను నిమ్ముగఁ జెప్పె నని విలాసమహేంందా!
322
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )