ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
ఆశ్వాసాంతము
క. అభిమానమహార్ణవ! హరి | నిభ విభవ విభాసమాన! నిరవద్య! రవి
ప్రభ! రాజమనోహర! వై | రిభయంకరశౌర్య! నృపవరేణ్యశరణ్యా!
323
మత్తకోకిల. రాజభూషణ! నిత్యసత్య! సరస్వతీవిలసన్ముఖాం
భోజ! రాజమనోజ! భూజనపూజ్యమాన! మహాయశో
రాజహంసపయోజినీవనరమ్యదిఙ్‌ముఖ! విక్రమో
ద్వేజితాహిత! విష్ణుసన్నిభ! విష్ణువర్ధనభూపతీ!
324
గద్య. ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున విదురాగమనంబును, గృష్ణసందర్శనంబును, రాజ్యార్ధలాభంబును, ఖాండవప్రస్థనివాసంబును, సుందోపసుందోపాఖ్యానంబును, నారదువచనంబున ద్రౌపదియందు సమయక్రియయు, నర్జునుతీర్థాభిగమనంబును, నులూచిసమాగమంబును, జిత్రాంగదయందు బభ్రువాహనుజన్మంబును, ద్వారకాగమనంబును, వాసుదేవానుమతుం డయి యర్జునుండు సుభద్ర వివాహం బగుటయు, సుభద్రాహరణంబును, హరణహారికయు, నభిమన్యుసంభవంబును, గాండీవ దివ్యరథాశ్వలాభంబును, ఖాండవదహనంబును, నగ్నిభయంబువలన మయభుజంగమోక్షణంబును, మందపాలోఖ్యానంబును నన్నది సర్వంబును నష్టమాశ్వాసము. 325
శ్రీమదాంధ్ర మహాభారతమునందలి యాదిపర్వము సమాప్తము.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )