ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
నారదుఁడు పాండవులయొద్దకు వచ్చుట (సం. 2-5-2)
ఉ. నీరజమిత్త్రుఁ డేల ధరణీగతుఁ డయ్యెడు నొక్కొ యంచు వి
స్మేర మనస్కులై జనులు మెచ్చి నిజద్యుతి చూచుచుండఁగా
నారదుఁ డేఁగుదెంచె గగనంబుననుండి సురేంద్రమందిర
స్ఫారవిలాసహాసి యగు పార్థుగృహంబునకుం బ్రియంబునన్‌.
23
క. తన పిఱుఁద ధర్మ సంబో | ధన వాంఛను వచ్చు దేవతా ఖచర మహా
మునివరులఁ దపనమార్గం | బునఁ గ్రమ్మఱఁ బంచె బ్రహ్మపుత్త్రుఁడు నెమ్మిన్‌.
24
వ. పర్వతపారిజాతరైవత సుముఖు లను మహామునులతో నిట్లు వచ్చిన నారదమహామునికిం బ్రత్యుద్గతుండయి ధర్మరాజు దమ్ములుం దానును నమస్కరించి తోడ్కొని తెచ్చి యున్నతాసనంబున నునిచి యడుగులు గడిగి, యర్ఘ్యపాద్యాదివిధులం బూజించిన, వారల కుశలం బడిగి నారదుఁడు రాజనీతి విషయంబుల నయ్యుధిష్ఠిరు ని ట్లని యడిగె. 25
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )