ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
ఇట్టి సభ నెచ్చటనైనఁ జూచితిరా యని ధర్మజుఁడు నారదు నడుగుట (సం. 2-6-8)
వ. అని కృతాంజలి యయి ‘మునీంద్రా! యీత్రిలోకంబులయందును మీ చూడనివి లే; వెందే నిట్టి యపూర్వంబైన సభ చూచి యెఱుంగుదురే?’ యని మయ నిర్మితం బయిన సభ చూపినం జూచి విస్మితుండయి నారదుండు ధర్మరాజున కి ట్లనియె. 58
క. భూనాథ! యిది యపూర్వ, మ | మానుషము, విచిత్ర రత్నమయ; మిట్టి సభన్‌
మానవలోకేశ్వరులం | దే నెన్నఁడుఁ జూచి వినియు నెఱుఁగ ధరిత్రిన్‌.
59
క. సురపతి యమ వరుణ ధనే | శ్వర కమలాసనుల దివ్యసభలెల్ల నరే
శ్వర! చూచితి; నవి దీనికి | సరిగా వత్యంతవిభవసౌందర్యములన్‌.
60
వ. అనిన విని ‘యవి యెట్టివి? వాని వినవలతు నానతిం’డని లోకపాల సభావిభవ శ్రవణ ప్రభూత కుతూహల చేతస్కుండై యడిగిన ధర్మరాజునకు నారదుం డి ట్లనియె. 61
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )