ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
కృష్ణుఁడు ద్వారకానగరమున కరుగుట (సం. 1-22-53)
వ. నారాయణుండును ధర్మరాజు వీడ్కొని తద్దివ్యరథారూఢుండయి ద్వారవతీపురంబున కరిగె, నంత నిక్కడ. 224
చ. భరతకులైక భూషణుఁడు భాసురతేజుఁడు ధర్మనందనుం
డురు భుజ విక్రమంబున జయోన్నతిఁ బోల్పఁగ వీరు లోకపా
లురయని భీముఁ బార్థు నకులున్‌ సహదేవునిఁ బంచెఁ దూర్పు ను
త్తరమును బశ్చిమంబు మఱి దక్షిణమున్‌ వరుసన్‌ జయింపఁగన్‌.
225
వ. ఇట్లు పంచిన నలువురు నపార చతురంగ బలసమేతులై నాలుగు సముద్రంబులపై నడచు నపూర్వ సముద్రంబులుం బోలె నాలుగు దిక్కులపై నడచి రనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 226
క. నరసుతు లయ్యై దిక్కుల | కరిగి మహీపతులచేత నరిగొని ధనముల్‌
దెరలఁగఁ దెచ్చిన మార్గముఁ | బరువడి నెఱిఁగింపు నాకుఁ బరమమునీంద్రా!
227
వ. అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె. 228
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )