ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
సహదేవుండు దక్షిణ దిగ్విజయంబు సేయుట (సం. 2-28-1)
వ. అట సహదేవుండు దక్షిణ దిక్కున కరిగి సుమిత్ర శూరసేన దంతవక్త్ర యవనులను, గోశృంగగిరి నివాసులను జయించి కుంతిభోజుచేతం బ్రియపూర్వకంబున సత్కృతుం డయి. 246
ఆ. జలజనాభుపగతు జంభకుండనువాని | భూరిబలునిపుత్త్రుఁ బోరిలోన
నొడిచి వానిచేత నుత్తమ గజహయ | రత్నతతులు గొని పరాక్రమమున.
247
వ. నర్మదాసమీపంబున నవంతి పతుల విందానువిందుల మందదర్పులం జేసి చని, మాహిష్మతీపురంబు పయి విడిసిన. 248
క. వీరుఁడు తత్పురవిభుఁ డు | గ్రారివిమర్దనుఁడు నీలుఁ డనువాఁడు మహా
దారుణబలుఁ డై సమర | ప్రారంభాత్యుగ్రుఁ డయ్యెఁ బాండవుతోడన్‌.
249
వ. అంత. 250
క. దరికొని దహనుం డెగసెను | వరుసను సహదేవుసకలవాహినిమాద్య
త్కరులపయిఁ దురగములపయి | వరరథములపయిఁ బదాతివర్గములపయిన్‌.
251
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 252
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )