ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
ఆశ్వాసాంతము
క. భూరి గుణ రత్న భూషణ! | నారాయణమూర్తి! రాజనారాయణ! కం
ఠీరవ విక్రమ! శారద | నీరద నీహార హీర నిభశుభకీర్తీ!
295
అంబురుహ వృత్తము. రాజకులోత్తమ! రాజమనోహర! రాజసూరి సభాంతర
భ్రాజిత సద్గుణ పార్థివశేఖర! పార్థ సన్నిభ! బాంధవాం
భోజవనద్యుమణీ! మణికాంచన పుంజ భూషిత! భూమరు
ద్రాజసమాజ! పరాక్రమరాఘవ! రాజరాజనరేశ్వరా!
296
గద్య. ఇది సకలసుకవిజనవినుతనన్నయభట్ట ప్రణీతంబయిన శ్రీ మహాభారతంబునందు సభాపర్వంబున ధర్మరాజునకు సభాప్రాప్తియుఁ, గింకరదర్శనంబును, నారదువలన లోకపాలుర సభాశ్రవణంబును, రాజసూయ మహాధ్వరారంభంబును, జరాసంధవధయు, గిరివ్రజ నిరుద్ధులయిన రాజులం గృష్ణుండు విడిపించుటయు, దిగ్విజయంబును, రాజసూయంబు నన్నది ప్రథమాశ్వాసము. 297
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )