ఇతిహాసములు భారతము సభాపర్వము - ద్వితీయాశ్వాసము
ఆశ్వాసాంతము
రథోద్ధతము. హార హీర ధవళాంశు నిర్మలో
దార కీర్తి! రణదర్ప! సద్గుణా!
వైరి వీర రస వైద్య! మన్మథా
కార! ధీర! పరగండభైరవా!
320
క. కరుణావతార! ధరణీ | సురవర సురభూజ! రాజసుందర! నయబం
ధుర! ధర్మధురంధర! మం | దరధైర్య! సుహృన్నిధాన! దానవినోదీ!
321
ఉత్సాహము. రాజవంశవార్ధిచంద్ర! రాజదేవ! నిత్యల
క్ష్మీ జయాభిరామ! ధర్మమిత్త్ర! మిత్త్ర విద్వదం
భోజ వన పయోజమిత్త్ర! భూరి కీర్తి కౌముదీ
రాజిత త్రిలోక! నిఖిల రాజ నిత్య పూజితా!
322
గద్య. ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతం బయిన శ్రీమహాభారతంబునందు సభాపర్వంబున నర్ఘ్యాభిహరణంబును, శిశుపాల వధయును, రాజసూయ విభూతికి దుఃఖితుండై సభాస్ఖలితుండై యున్న దుర్యోధనుం జూచి ద్రౌపదీభీమసేనులు నగుటయు, రాజసూయవిభూతి సూచి సహింపక దుర్యోధనుండు జూదం బొనర్చుటయు, నందు శకుని కైతవంబున ధర్మరాజ పరాజయంబును, ద్యూతదుఃఖార్ణవ మగ్నులయిన పాండవులం బాంచాలి యుద్ధరించుటయుఁ, బునర్ద్యూత పరాజితులయి పాండవులు వనవాసగతు లగుటయు నన్నది సర్వంబును ద్వితీయాశ్వాసము. 323
శ్రీమదాంధ్ర మహాభారతమునందలి సభాపర్వము సమాప్తము.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )