ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము
సముద్రమునఁ బర్వతములను మ్రింగివేయు మహా మత్స్యములు
వ. ఇట్లు వానర వీరులు పర్వత పాషాణ వృక్షజాతంబులు లక్షోపలక్షలు గాఁ దెచ్చి
వారాశిం బడవైచి తద్గుభగుభధ్వానంబుల కుప్పొంగుచు బ్రహ్మాండ భాండంబు
బ్రద్దలగు నట్లుగా నార్చుచు నట్టహాసంబులు సేయుచు గంతులు పెట్టుచు
వెక్కిరింపుచుఁ బరువు లెత్తుచు మున్ను దెచ్చివైచిన పర్వతాదులనెల్లఁ దిమి
తిమింగిలములు మ్రింగ నాసమయంబున.
42
ఆ. తిరుగఁదెచ్చివైవఁ దేలి రాకుండుట
నాత్మలోన సంశయంబు నొంది
రాజసింహుఁడపుడు రత్నాకరునిఁ జూచి
యడుగుటయును వేగ నాతఁడనియె.
43
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - prathamAshvAsamu ( telugu andhra )