ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము
నలునిచే సేతు నిర్మాణము
సీ. రావణుపంపున రాలెల్లఁ జేఁపలు-మ్రింగుచుండెఁ గదయ్య మేదినీశ!
తిమితిమింగిలములు దిరుగుచు నాయందు-నుండి రావణుపంపు నొనరఁ జేయు
నలుఁడు కట్టినఁ గాని నిలువ నేరదు కట్ట-నలునిఁ బంపఁగదయ్య నళిననేత్ర!
యని సరిత్పతి సెప్పి యవ్వేళ నరిగిన-వీరు లిచ్చట మహావీర్యమునను
 
తే. పర్వతంబులు తేరఁగా భానుకులుని-పంపుచేతను వారిధిఁబరఁ వేగ
నలుడు నా ప్రొద్దె పది యోజనములు గట్టె-నంతలో సూర్యుఁడస్తాద్రి కరుగుచుండె.
44
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - prathamAshvAsamu ( telugu andhra )