ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము
అతికాయుఁడు వానరుల దుండగములను రావణునకు మనవిసేయుట
శా. దేవా! భానుకులావతంసుఁడు మహాధీరుండు రాముండు బా
హావిర్భూతమహా ప్రతాపమున దైత్యవ్రాతమున్‌ భూరి వీ
రావేశంబునఁ ద్రుంచెఁబో మనము నందాశ్చర్యమున్‌ భీతియున్‌
ద్రోవన్‌ వేఱవచింపనేల యిఁకఁ దద్ఘోర ప్రతాపోన్నతుల్‌.
46
వ. అని అతికాయుఁడు విన్నవించిన నుల్కిపడి కుంభకర్ణుని మేల్కొలుపఁ బనిచిన నతండును
లేచి యావులింపుచుఁ బండ్లుగీటుచు లయకాలమృత్యువుం బోలె నేతెంచిన నట్టి
యనుజుంజూచి దశముఖుం డిట్టులనియె.
47
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - prathamAshvAsamu ( telugu andhra )