ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము
పవనజుఁడు సుపార్శ్వుని మట్టుపెట్టుట
క. అంత సుపార్శ్వుఁడు మిక్కిలి
పంతము నెఱపుచును రథము పవనాత్మజుపై
నెంతయుఁ బఱపుచు బాణము
లంతంతనె నాట నేయునవసరమందున్‌.
15
సీ. హనుమంతుఁ డాదైత్యునరదంబు పై దాఁటి-చెక్కలు వాఱంగఁ ద్రొక్కివేసి
సైంధవంబులఁ జంపి సారథితలఁగొట్టి-గొడుగులు పడగలు పుడమిఁ గలిపి
వడి వానిచే నున్న యడిదంబుఁ గైకొని-బిరుసుగా నేసిన ధరను గూలి
గొబ్బునఁ దెప్పిర్లి కోపంబు దీపింప-ననిలజునురము మూఁడంబకముల
 
తే. జాంబవంతుని నిరుమూఁడు సాయకముల-వడి గవాక్షుని నైదింట వాలిసుతుని
నేడు బాణంబులను దూలనేసె నంత-నవనిఁ బడి లేచి యంగదుం డాగ్రహమున.
16
తే. వాని చేవిల్లు విఱిచిన వాఁడు కినిసి
పరిఘఁ గొని యేయ మూర్ఛిల్లి ధరణి వ్రాలి
తెలిసి యంగదుఁ డాదైత్యుఁ దెగువ నురము
పిడు గడంచినగతి ముష్టిఁ బొడిచి చంపె.
17
వ. ఇట్లు సుపార్శ్వాది రక్షోనాయకు లాక్షణంబునం గూలిన. 18
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - dvitIyAshvAsamu ( telugu andhra )