ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము
శాప విముక్తయై దేవకన్యయైన మొసలి
సీ. మడుగుఁ లోపలఁ జొచ్చి కడుపార నుదకంబు-గ్రోలంగ దిగ నందుఁ గ్రాలు మొసలి
పాదముల్‌ కబళించి పట్టినఁ జరణముల్‌-విదళింపఁ బట్టూని విడవకున్న
గడుసూక్ష్మరూపుఁడై కడుపులోపలఁ జొచ్చి-వేగంబ భేదించి వెడలె నంత
నది దేవకన్యయై యాకాశముననుండి-తనదు వృత్తాంత మంతయును జెప్పి
 
తే. వీఁడు దైత్యుండు నమ్మకు వీనిఁ జంపి-పొమ్ము సంజీవికొండకుఁ బ్రొద్దు గలుగ
నీకతంబున శాపంబు నాకుఁ దీఱె-ననుచు దీవించి చనియెఁ దా నమరపురికి.
74
వ. అంత హనుమంతుడు తేజోవంతుండై యరుగుదెంచి కపటసంయమినిం గనిన నతండిట్లనియె. 75
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - dvitIyAshvAsamu ( telugu andhra )