ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము
లక్ష్మణుఁడు సంజీవనిచే మూర్ఛదేరుట
వ. రామచంద్రుం డతనిం గౌఁగిలించుకొని సుషేణుం జూచి నీ విందలి దివ్యౌషధంబులవలన
సౌమిత్రి ప్రాణంబులు తేర్పుమనిన నయ్యధిపు నాజ్ఞ శిరంబునఁ దాల్చి వనచర సహితుండై
పర్వతం బెక్కి తొల్లి దేవత లమృతపానంబు చేసిన తావును నారాయణుండు మోహినీరూపంబున
నమృతము పంచునప్పుడు సూర్యచంద్రులనడుమ నిఱికిన రాహువు శిరంబుఁ ద్రుంచిన తావును
బలిచక్రవర్తి యాగంబు చేసిన తావును రాక్షసులు జన్మించిన తావును శంకరభగవానుండు
పర్వతరాజు కూఁతును బెండ్లియాడిన తావును వానరులకుం జూపుచు నగ్గిరీంద్రంబుపై నున్న
యౌషధంబులు గొనివచ్చి ప్రయోగింప నాయౌషధముల సామర్థ్యంబునం జేసి లక్ష్మణునకుఁ
బ్రాణంబులు మగుడ వచ్చె నంత సకల వానరులు నానందసాబ్ధిందేలి రప్పుడు సౌమిత్రి రామునకు
నమస్క్జరించిన రామచంద్రుండు కౌఁగిటం జేర్చి హనుమంతుం డొనరించిన యుపకృతికి సంతోషించి
యీ పర్వతంబును దొల్లింటి యునికినే యుంచి రమ్మనిన నతం డట్లు కావించెనని నారదుండు సెప్పిన
వాల్మీకి మునీశ్వరుం డట మీఁది కథావిధానం బెట్టి దని యడుగుటయు.
92
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - dvitIyAshvAsamu ( telugu andhra )