కీర్తనలు దాసు శ్రీరాములు అడవి ముష్ణికాయ - అది నీకు ప్రియమాయె - అయ్యో నే నేమందురా
ముఖారి - మిశ్రచాపు
పల్లవి:
అడవి ముష్ణికాయ - అది నీకు ప్రియమాయె - అయ్యో నే నేమందురా॥అడవి॥
అనుపల్లవి:
పడుచుతనము చేత - భ్రమజెందుటేగాని - పదరా నీలి వార్త॥అడవి॥
చరణ:
వింత వింతల మారి - సంతమెరుగులాడి - తంతర గొట్టుదిరా
సంతోషమున దాని - సరస జేరుటేగాని
ఇంతి మంతనములు - యెండమావుల నీళ్లు
॥అడవి॥
చేసితివౌ లేర - చెలియతో స్నేహము - చేతి సంచి వెచ్చము
ఆసచేత దాని - నంట బోవుటేకాని
కాసు చేయదు వట్టి - కట్టు గారడి సామి
॥అడవి॥
కోప మెంచకు తోట్ల - వల్లూరి శ్రీవేణుగోపాలా బాగాయెరా
శ్రీపూర్ణుడగు దాసు - శ్రీరామకవి వాక్య
వ్యాపారములు వే - దాక్షరములు నమ్ము
॥అడవి॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - aDavi muShNikaaya - adi niiku priyamaaye - ayyoo nee neemaMduraa - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )