కీర్తనలు దాసు శ్రీరాములు ఏమని తెల్పుదునే - కోమలి నాభాగ్య
ఫరజు - చాపు
పల్లవి:
ఏమని తెల్పుదునే - కోమలి నాభాగ్య
మేమని తెల్పుదునే - నా ముద్దుసామికి
నామీద ప్రేమ
॥నేమని॥
చరణ:
చెక్కిలి ముద్దాడెనే - చక్కని నాసామి
చెక్కిలి ముద్దాడెనే
నిక్కముగ నిన్నరేయి - ప్రక్కనే పవ్వళించి
చక్కని కెమ్మోవి నొక్కెనే
॥ఏమని॥
బాళిచే నన్నేలెనే - కేళిలో నాసామి
బాళిచే నన్నేలెనే
వేళగదే రారమ్మని - విలువగల సొమ్ములిచ్చి
చాలగా లాలించెనే - సోలెనే బాల నే
॥నేమని॥
నాసాటి పేరనెనే - వేణుగోపాలుడు
నాసాటి పేరనెనే
ఆసదీర్చి రామ
- దాసకవి చిత్త
వాసుడాయె పూసెనే గంధము - చేసెనే బాస నే
॥నేమని॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - eemani telpudunee - koomali naabhaagya - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )