కీర్తనలు దాసు శ్రీరాములు ఏమనెనే కోమలీ - తెలుపవే నీతో
ఫరజు - ఆది
పల్లవి:
ఏమనెనే కోమలీ - తెలుపవే నీతో
ఏమనెనే కోమలీ- తెలుపవే నీతో
॥నేమనెనే॥
చరణ:
అంగజు బారికి - నిలువ దరమటే
మంగళవార్తలు - మరియేమి నీతో
॥నేమనెనే॥
మోహ పయోధిలో - మునిగితినిక నే
యూహలు సేయుదు - నొకసారి నీతో
॥నేమనెనే॥
దాసు శ్రీరామ - కవి గీతసుధా
దాసుడైన హరి - దయచేసి నీతో
॥నేమనెనే॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - eemanenee koomalii - telupavee niitoo - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )