కీర్తనలు దాసు శ్రీరాములు తెలియదే తెలియదే - తెలియదే మాయ
కాఫి - ఆది
పల్లవి:
తెలియదే తెలియదే - తెలియదే మాయ ॥తెలియదే॥
అనుపల్లవి:
వలపు సొలపులో - వాని గుణమేమొ కాని ॥తెలియదే॥
చరణ:
వలపించుటే కాని - వలచుటలేదే దాని
కలనైన మరువడే - కానిపని చేసినాడే
॥తెలియదే॥
చెలియరో నే మందు - బలమగు దానిమందు
తల కెక్కెనేమో అందు - వలన రాడే యిందు
॥తెలియదే॥
వేమరు ననుగూడి రాడు - వింతమాట లాడినాడు
భామరో దాసు శ్రీరామ - పాలుడే గోపాలుడే
॥తెలియదే॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - teliyadee teliyadee - teliyadee maaya - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )