కీర్తనలు దాసు శ్రీరాములు దయలేక నీవురాక యున్న - తాళ జాలరా
కాఫి - రూపక
పల్లవి:
దయలేక నీవురాక యున్న - తాళ జాలరా ॥దయలేక॥
చరణ:
నిన్నరేయి కన్నులార - నిదుర లేదురా
వన్నెకాడ నిదురలేక - వాచియుంటిరా
॥దయలేక॥
ఉత్తమాటగాదు నిన్నె - గుత్త గొంటిరా
చిత్తగించు నాదు మనవి - చిత్తగించరా
॥దయలేక॥
శ్రీసఖా నే జేసుకొన్న - దోస మేమిరా
వాసిమీర దాసురామ - దాసు నేలరా
॥దయలేక॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - dayaleeka niivuraaka yunna - taaLa jaalaraa - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )