కీర్తనలు దాసు శ్రీరాములు నను విడనాడుట - న్యాయమా సామి
హిందుస్థానీ భైరవి - ఆది
పల్లవి:
నను విడనాడుట - న్యాయమా సామి
న్యాయమా సామి - న్యాయమా సామి
॥నను॥
చరణ:
కనికర మేల లేదు - కారణ మేమిర
కారణ మేమిర - కారణ మేమిర
॥నను॥
నను మరుబారి ద్రోయ - న్యాయమా సామి
న్యాయమా సామి - న్యాయమా సామి
॥నను॥
విను తోట్లవల్లూరి - వేణుగోపాల
వేణుగోపాలా - వేణుగోపాలా
॥నను॥
ఘన దాసు రామావన - కరుణింప వేమిరా
కరుణింప వేమిరా - కరుణింప వేమిరా
॥నను॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - nanu viDanaaDuTa - nyaayamaa saami - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )