కీర్తనలు దాసు శ్రీరాములు నిలునిలు మటుండుమీ - నాసామి
ఖమాస్‌ - ఆది
పల్లవి:
నిలునిలు మటుండుమీ - నాసామి
నీవు నాదరి రాకుమీ - నాసామి
॥నిలు॥
చరణ:
ఆ మాయలాడి - ఏమి బోధించెరా
సామి నాకు దెల్పరా - సంశయమేమిరా
॥నిలు॥
సన్నుతాంగిని గూడి - నాసాటి వారిలో
నన్ను రద్ది జేయుట - న్యాయము గాదుర
॥నిలు॥
వేసగాడవుగద - వేణుగోపాలసామి
దాసుశ్రీరామకవిని - ధన్యుని జేయర
॥నిలు॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - nilunilu maTuMDumii - naasaami - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )