కీర్తనలు దాసు శ్రీరాములు నీతోటి మాటలు - నాకేలరా సామి
కాఫి - ఆది
పల్లవి:
నీతోటి మాటలు - నాకేలరా సామి
నాతోటి మాటలు - నీకేలరా
॥నీతోటి॥
అనుపల్లవి:
నే తాళ దానితో - ఖాతాలు నీకేల
ప్రీతిగల నాతియని - పోతివి రాతిరి
॥నీతోటి॥
చరణ:
పరువటరా నాతో - పనులేమిరా సామి
పరువటరా నాతో - పనులేమిరా
విరజాజి బంతులు - విసరకురా సామి
సరసము విరసమౌ - చాలుర చాలుర
॥నీతోటి॥
ఒయ్యార మిదియేమి - ఊరుకోరా సామి
ఒయ్యార మిదియేమి - ఊరుకోరా
ఉయ్యాల మంచము - నూచకురా సామి
అయ్యది గయ్యాళి - అయ్యయో అయ్యయో
॥నీతోటి॥
వేసమా వల్లూరి - వేణుగోపాలా సామి
వేసమా వల్లూరి - వేణుగోపాలా
దాసు శ్రీరాముని - భాసుర వాక్యము
చేసెరా వేయివేలు - సేబాసు సేబాసు
॥నీతోటి॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - niitooTi maaTalu - naakeelaraa saami - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )