కీర్తనలు దాసు శ్రీరాములు నే గననా సామి - నే గననా
కాఫి - చాపు
పల్లవి:
నే గననా సామి - నే గననా
శ్రీగల వాడవు నీవని - చిన్నతనము సుందరుండవని
కౌగిట నేను బదినాలుగు విధముల - గరడీలు గరపినది
॥నే॥
చరణ:
వేడుక కాడవు నీవని - వీధిలో నినుగని పోకుమని
కోడెకాడ రారమ్మని - కోడిగము లాడినది
॥నే॥
చక్కని వాడవు నీవని - చనవుగలదు వెరపేమి యని
చక్కిలి గింతలు గొలుపుచు మోవి చు - రుక్కున నొక్కినది
॥నే॥
వాసిగ వల్లూరి వాసుడని - భాసుర వేణుగోపాలుడని
దాసు రామకవిపాలుడని దర - హాసము జేసినది
॥నే॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - nee gananaa saami - nee gananaa - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )