కీర్తనలు దాసు శ్రీరాములు పాట బాడెద రార సామి - పరమానందమురా, నాసామి
సురటి - రూపకం
పల్లవి:
పాట బాడెద రార సామి - పరమానందమురా, నాసామి
బ్రహ్మానందమురా నాసామి - పరమానందమురా
॥పాట॥
చరణ:
మదన జనక నీదు దయ - మదినిగోరి యున్నదాన
ముదముమీర ముచ్చటాడి - ముద్దుబెట్టరా, నాసామి
ముద్దుబెట్టరా నాసామి
॥పాట॥
వలపు నిలుప లేదురా - వగలుమాని యేలుకోర
కళలుదేర నొక్కసారి - కౌగిలించరా, నాసామి
కౌగిలించరా నాసామి
॥పాట॥
వనజనయన నిశ్చలా - వరద వేణుగోపబాల
ఘనుడ దాసు రామపాల - కాంక్షదీర్చరా, నాసామి
కాంక్షదీర్చరా నాసామి
॥పాట॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - paaTa baaDeda raara saami - paramaanaMdamuraa, naasaami - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )