కీర్తనలు దాసు శ్రీరాములు భామిని రాగదే - సామిని తేగదే
కాఫి - ఆది
పల్లవి:
భామిని రాగదే - సామిని తేగదే
కాముని బారికి - తాళుదునే
తాళుదునే
- తాళుదునే ఆ
కాముని బారికి - తాళుదునే
॥భామిని॥
చరణ:
నిన్న మొన్న గూడిన చెలిపై - మోహము నిండారగ
నన్ను మరచెను గదలే - మదవతీ
తాళుదునే యెటు - తాళుదునే ఆ
వెన్నెల కాకకు - తాళుదునే
॥భామిని॥
చెల్లబోనా సాటి - చెలులలో
చిన్నతనం - బాయెనే
మొల్ల విరులమీద - మెల్లని యీ
చల్లని గాలికి - తాళుదునే
తాళుదునే నేనెటు - తాళుదునే ఈ
చల్లని గాలికి - తాళుదునే
॥భామిని॥
ప్రేమమీర దాసు - కులజుడౌ
రామ కవీంద్రుని - బ్రోచెనే
సామజ వరదుం - డలిగెనే
ఆమని ఢాకకు - తాళుదునే
॥భామిని॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - bhaamini raagadee - saamini teegadee - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )