కీర్తనలు దాసు శ్రీరాములు మనసిచ్చి నాతో - మాటాడవేమిరా
బేహాగ్‌ - ఆది
పల్లవి:
మనసిచ్చి నాతో - మాటాడవేమిరా ॥మనసిచ్చి॥
చరణ:
మనవి వినరాదా - మమతింత లేదా
మునుపటి చెలిమికాదా - మోదముకాదా
॥మనసిచ్చి॥
విను నేను బాల - విడనాడ మేలా
చనవుంచుమీ చాల - జాలమిదేలా
॥మనసిచ్చి॥
వర దాసుశ్రీరామా - వనసుగుణధామా
శరణు నన్నేలు ప్రేమ - శ్యామాభిరామా
॥మనసిచ్చి॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - manasichchi naatoo - maaTaaDaveemiraa - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )