కీర్తనలు దాసు శ్రీరాములు మొట్టమొదట - నట్టనడుమ
జంఝాటి - రూపకం
పల్లవి:
మొట్టమొదట - నట్టనడుమ
తుట్ట తుదియు - నెరుగనే
ఇట్టెవచ్చి విభుడు రాత్రి - ఏమిపనులు చేసెనే
॥మొట్ట॥
చరణ:
మోము మోము గదియ విభుడు - ముద్దుపెట్టి నంతలో
భామ యేమొకాని నేను - పరవశమై యుంటినే
॥మొట్ట॥
అట్టె విభుడు చన్నుదోయి - బట్ట వచ్చినంతనే
యెట్టి మాయయేమొ నాదు - హృదయ మైక్యమయ్యెనే
॥మొట్ట॥
భాసుర శ్రీవేణుగోప - బాలుడంటినంతనే
దాసురామదాస చిత్త - వాసి యనుకొంటినే
॥మొట్ట॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - moTTamodaTa - naTTanaDuma - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )