కీర్తనలు దాసు శ్రీరాములు రమణిరో సముఖాన - రాయబార మేటికే
కానడ - రూపకం
పల్లవి:
రమణిరో సముఖాన - రాయబార మేటికే
నిమిషమైన తాళలేనె - నేనె వాని రమ్మందునె
॥రమణిరో॥
చరణ:
కడువేడుక వానిమేన - గంధమును బూసి యాకు
మడుపులిచ్చి తడవేటికి - మాపటికి రమ్మందునె
॥రమణిరో॥
కోరివానిజేరి ప - న్నీరుజల్లి నన్ను
వేరుసేయ మేరగాదు - వేవేగ రమ్మందునె
॥రమణిరో॥
భాసురాంగి వేణుగో - పాల యింత పంతమేల
దాసు రామకవి సన్నుతి - జేసె నిక రమ్మందునె
॥రమణిరో॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - ramaNiroo samukhaana - raayabaara meeTikee - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )