కీర్తనలు దాసు శ్రీరాములు వగకాడ తగదిక రారా
ఖమాస్‌ - ఆది
పల్లవి:
వగకాడ తగదిక రారా
మగువ నేచుట - మంచిదటరా
॥వగకాడ॥
చరణ:
కృపలేదా - సామి నామీద
ఉపరతి సుఖమున - నోలలాడించెద
॥వగకాడ॥
వినవేర - వేణుగోపాలా
మనసున నీకుగల - మర్మము దెలుపర
॥వగకాడ॥
పసిబాల - తాళజాలర
రసిక దాసు శ్రీ - రాము నేలుకోరా
॥వగకాడ॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - vagakaaDa tagadika raaraa - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )