కీర్తనలు దాసు శ్రీరాములు వద్దు వద్దుర ఇక - వదలరా సామి
ఫరజు - చాపు
పల్లవి:
వద్దు వద్దుర ఇక - వదలరా సామి
పొద్దు పోయెరా నీ - పుణ్యము పోపోరా
॥వద్దు॥
చరణ:
కోపగించకు మగని - కోత కోర్వను సామి
రేపు వచ్చెద చాల - సేపాయె పోపోర
॥వద్దు॥
కంటగించకు నే - గానా నీదాన సామి
యింటికి పోవలె - నిప్పుడే పోపోరా
॥వద్దు॥
వినుమ నా మనవి - వేణుగోపాలా
ఘన దాసు శ్రీరామ - కవిపాల పోపోర
॥వద్దు॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - vaddu vaddura ika - vadalaraa saami - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )