కీర్తనలు దాసు శ్రీరాములు వనితరో యీ వన్నె - లేలనే ఈ వేళనాకు
ఆనందభైరవి - రూపకం
పల్లవి:
వనితరో యీ వన్నె - లేలనే ఈ వేళనాకు
తనువేల తరుణులేల - ధనమేల ధామమేల
॥వనిత॥
చరణ:
ఆకులేల పోకలేల - అన్నమేల పానమేల
శ్రీకరుండు రాకయుండి - ఆశలుడిగి యున్నవేళ
॥వనిత॥
సొగసేల సొమ్ములేల - అగరేల గంధమేల
మగనికి దయలేక మేను - సగమై యున్నట్టివేళ
॥వనిత॥
భాసురాంగి తోటలేల - పాటలేల ఆటలేల
దాసు రామ పాలు బాసి - ఆసలుడిగి యున్నవేళ
॥వనిత॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - vanitaroo yii vanne - leelanee ii veeLanaaku - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )