కీర్తనలు దాసు శ్రీరాములు సరిసరిలే మంచిది
కాఫి - ఆది
పల్లవి:
సరిసరిలే మంచిది
మరుశరములకు బె - దరి దరి జేరినది
॥సరి సరి॥
అనుపల్లవి:
అరమరిక లేమిరా - అరమరిక లేమిరా ॥సరి సరి॥
చరణ:
పలుమరు నే నిను - బ్రతిమాలితి నని
పాటింపరా వేణు - గోపాలా
కలకాలంబును - ఘనమా ఇది
॥సరి సరి॥
మ్రొక్కగ వచ్చిన - మోడి సేతువురా
మోహన రూపా - వేణుగోపాలా
దక్కితిరా దాసు - శ్రీరామపాలా
॥సరి సరి॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - sarisarilee maMchidi - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )